పుష్ప టీమ్ కు బన్నీ ఖరీదైన కానుకలు!


పుష్ప ఈ నెల 17న విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే సినిమా షూటింగ్ ఈరోజు చిత్రీకరణను పూర్తి చేసుకుంది. అల్లు అర్జున్ టీమ్‌తో చాలా సంతోషంగా ఉన్నాడు. అయితే బన్నీ యూనిట్‌లోని కనీసం డజను మంది ముఖ్య సభ్యులకు ఒక్కొక్కటి 10 గ్రాముల బరువున్న బంగారు ఉంగరాలను బహుమతిగా ఇచ్చాడు.

సినిమా ఫైనల్ అవుట్ పుట్ పై బన్నీ చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అందుకే కష్టపడిన కొందరికి ప్రత్యేకంగా బహుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక సమంత సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించనున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రష్మీక మందన్న హీరోయిన్ గా నటించగా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అంధించారు.


Post a Comment

Previous Post Next Post