జగన్ అపాయింట్‌మెంట్ కోసం మెగాస్టార్ ఎదురుచూపులు!


మెగాస్టార్ చిరంజీవి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్లు మరియు టిక్కెట్ ధరలకు పరిష్కారం కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో రేట్ల పెంపు కోసం చర్చలు సక్సెస్ అయిన తర్వాత, చిరంజీవి ఇదే ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుంచారు.

మెగాస్టార్ జగన్ మోహన్ రెడ్డితో అపాయింట్ మెంట్ కోరారని తెలుస్తోంది. టాలీవుడ్ లోని ప్రముఖ బృందంతో ముఖ్యమంత్రిని కలిసి.. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన దృష్టికి తీసుకెళ్తారట. తెలంగాణ ప్రభుత్వంతో సమానంగా ధరల కోసం ఏపీ ప్రభుత్వాన్ని అభ్యర్థించనున్నారు. ఇక అపాయింట్‌మెంట్ ఇవ్వని పక్షంలో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ముందు మరో ప్రతిపాదన పెడతారని సమాచారం. మరి మెగాస్టార్ చర్చలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

Post a Comment

Previous Post Next Post