ఏపీ కోసం స్టార్స్ విరాళం.. ఎన్టీఆర్ తరువాత మహేష్, చరణ్!


రాయలసీమ వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ స్టార్స్ ముందుకు వస్తున్నారు.  సూపర్ స్టార్ మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ప్రభావితమైన వారి దుస్థితిని చూసి సూపర్ స్టార్ చలించిపోయి తన వంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

ఈరోజు తెల్లవారుజామున యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా 25 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కోసం విరాళంగా అందించారు. మెగాస్టార్ చిరంజీవి 25 లక్షలు, రామ్ చరణ్ కూడా 25లక్షల రూపాయలు అందించారు. త్వరలో మరికొంత మంది తారలు విరాళాలు ఇచ్చే అవకాశం ఉంది.  ఈ కీలక తరుణంలో ప్రభుత్వానికి మద్దతివ్వడమే మంచిదన్న నిర్ణయానికి తారలు వచ్చినట్లు కనిపిస్తోంది. ఇక ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్స్ రేట్ల విషయంలో  మరోసారి ఆలోచిస్తే బావుంటుందని సినీ ప్రముఖులు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.


Post a Comment

Previous Post Next Post