ఏం జరుగుతుందో చూద్దాం.. జగన్ ప్రభుత్వం అప్పీలుపై బాలయ్య రియాక్షన్


విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను దర్శించుకున్నారు. ఇక ప్రత్యేక పూజలు నిర్వహించిన బాలయ్య అనంతరం మీడియాతో మాట్లాడారు. రీసెంట్ గా ఏపీ టికెట్ల రేట్లపై ఇచ్చిన హైకోర్టు తీర్పుపై కూడా వివరణ ఇచ్చారు. 

హై కోర్టు తీర్పు కంటే ముందే టికెట్ల రేట్లు తక్కువగానే ఉన్నా  ధైర్యంతో అఖండ రిలీజ్‌ చేశాం.. సినిమా టికెట్‌ ధరల జీవో రద్దుపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్తామని చెప్పింది. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ మేము సినిమా మీద నమ్మకంతో అన్నింటికీ సిద్ధమయ్యే సినిమా విడుదల చేశాం. అఖండ సినిమా మంచి విజయం సాధించింది.. హిందూ ధర్మాన్ని ఈ సినిమా చూపించింది అని నందమూరి బాలకృష్ణ వివరణ ఇచ్చారు. ఇక ప్రస్తుతం బాలయ్య గోపిచంద్ మలినేనితో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.


Post a Comment

Previous Post Next Post