RC 15 రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన చరణ్!


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే అలాగే త్రిబుల్ ఆర్ సినిమా పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నారు చరణ్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఇటీవల ప్రముఖ మీడియా పోర్టల్‌తో తన తాజా ఇంటరాక్షన్‌లో, రామ్ చరణ్ RC15 విడుదల ప్రణాళికను వెల్లడించాడు. 

2023 ఫిబ్రవరిలో RC15ని థియేటర్స్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము అంటూ శంకర్ సర్‌తో కలిసి పనిచేయాలనే ఒక కల నిజమైంది. పొలిటికల్ డ్రామాతో ఆ సినిమా రూపొందుతున్నట్లు చరణ్ తెలిపారు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాను అంటూ ఆ సినిమాలో నా పాత్ర మూడు విభిన్నమైన షేడ్స్‌లో ఉంటాయని.  రాజమౌళితో కలిసి పనిచేయడం నటుడిగా ఎదగడానికి దోహదపడింది.. అని చరణ్ పేర్కొన్నాడు.


Post a Comment

Previous Post Next Post