కరోనా వైరస్ కారణంగా సినిమా ఇండస్ట్రీలకు కోలుకోలేని దెబ్బ పడింది. ఇక కరోనాను దాటి మళ్ళీ ఫామ్ లోకి వస్తున్న సమయంలో మరొక కొత్త వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఓమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ ప్రస్తుతం కొన్ని దేశాల్లో విస్తృతంగా స్ప్రెడ్ అవుతోంది. ఇక రానున్న రోజుల్లో దాని తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరిస్తోంది.
సాధారణ వైరస్ కంటే కూడా ఓమిక్రాన్ వేరియంట్ ఆరింతలు ఎక్కువగా వైరస్ ను స్ప్రెడ్ చేస్తుందని అంటున్నారు. ఇక ఆ వైరస్ ఫామ్ లోకి వస్తే సినిమా హల్స్ ఎప్పటిలానే మూత పడక తప్పదు. ఇక ప్రస్తుతం పెద్ద సినిమాల నిర్మాతల్లో కూడా ఒక ఆందోళన నెలకొంది. ఇక RRR ట్రైలర్ వాయిదాకు అవ్వడానికి కారణం కూడా అదేనని అనుకుంటున్నరు. ఇక పుష్ప, రాధేశ్యామ్ సినిమాల నిర్మాతల్లో కూడా భయం నెలకొన్నట్లు సమాచారం తేడవస్తే మొదటికే మోసం వస్తుందని సినిమాలను మళ్ళీ వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @TBO_Updates
Post a Comment