ప్రభాస్ సినిమా 15 భాషల్లో.. పాన్ వరల్డ్ రిలీజ్?


ప్రభాస్ భారీ బడ్జెట్ పౌరాణిక ఇతిహాసం ఆదిపురుష్ ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాని దాదాపు 15 భాషల్లో విడుదల చేసేందుకు ఆదిపురుష్ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.  భారతీయ భాషలతో పాటు, పౌరాణిక ఇతిహాసం చైనీస్ మరియు జపనీస్ వంటి అంతర్జాతీయ భాషలలో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు.

ఆదిపురుష్ ప్రఖ్యాత హిందూ పురాణాల ఆధారంగా రూపొందించబడుతోంది. రామాయణం గ్లోబల్ సబ్జెక్ట్ కాబట్టి చరిత్ర గురించి అందరూ తెలుసుకోవాలని అనుకుంటారు. అందుకే ఈ సినిమాను పాన్ వరల్డ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.  ప్రపంచవ్యాప్తంగా 15,000 స్క్రీన్లలో ఈ చిత్రం విడుదల కానుందని, ఇది మరో అద్భుతమైన ఫీట్ అవుతుందని కూడా టాక్ వినిపిస్తోంది. అలా రిలీజ్ అయితే మొదటిరోజే ఈ సినిమా 100కోట్ల వసూళ్లను అందుకుంటుందని చెప్పవచ్చు.

Post a Comment

Previous Post Next Post