తెలుగు సినిమా ప్రముఖ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు వెబ్ సిరీస్ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టారు. Zee5 కోసం ATM అనే ప్రాజెక్ట్ సెట్ చేసేందుకు దర్శకుడు హరీష్ శంకర్‌తో భాగస్వామి కానున్నారు. చంద్రమోహన్ దర్శకత్వం వహించిన ATM నెయిల్ బైటింగ్ థ్రిల్లర్‌గా ఉంటుంది.
టైటిల్ కు తగ్గట్టుగా, ATM ను దొంగిలించడానికి కలిసిన యువకులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అనేది అసలు పాయింట్. హరీష్ శంకర్, దిల్ రాజు కుమార్తె హన్షిత మరియు మేనల్లుడు హర్షిత్‌లతో కలిసి ATM ప్రొడ్యూస్ చేయడమే కాకుండా, ATM కథను కూడా రాశారు. స్క్రిప్ట్‌ను రూపొందించడానికి హరీష్ చాలా హార్డ్ వర్క్ చేశారట. ATM త్వరలో Zee5లో ప్రసారం కానుంది. మరి వెబ్ వరల్డ్ లో ఈ సీనియర్లు ఎలాంటి సక్సెస్ ను అందుకుంటారో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment