జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్?


ప్రముఖ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో అయితే మొత్తానికి తన సత్తాను నిరూపించుకుంది. ఇక గత కొంతకాలంగా ఆమె టాలీవుడ్ అరంగేట్రం కోసం చర్చలు జరుగుతున్నాయి. తాజా వార్త ఏమిటంటే, జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందట. డేరింగ్ దర్శకుడు పూరీ జగన్నాధ్ ఆమెను అతి త్వరలో తీసుకు వస్తారని తెలుస్తోంది. 

ప్రస్తుతం పూరి, విజయ్ లైగర్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్ర ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక పూరి, దేవరకొండ మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. స్క్రిప్ట్ కూడా లాక్ చేయబడిందట.  ఇక ఆ పాన్-ఇండియన్ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుందని సమాచారం. పూరి కథనంతో ఇంప్రెస్ అయిన జాన్వీ కపూర్ ఈ ప్రాజెక్ట్‌పై సంతకం చేసిందని టాక్. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుందట. ప్రస్తుతం జాన్వీ కపూర్ దోస్తానా 2, మిలీ, గుడ్ లక్ జెర్రీ చిత్రాలతో బిజీగా ఉంది.

Post a Comment

Previous Post Next Post