గబ్బర్ సింగ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'భవధీయుడు భగత్ సింగ్'. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి రాలేదు. గబ్బర్ సింగ్ చిత్రానికి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి కూడా సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు.
ఇక DSP ఇటీవలి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా పనుల గురించి వివరించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు ప్రారంభించామని, రెండు పాటలు కూడా కంపోజ్ చేశామన్నారు. “పవన్ కళ్యాణ్ సార్ పాటల గురించి చర్చించి చాలా బాగున్నాయని చెప్పారు. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తారని అనుకుంటున్నాను. మామూలుగా అయితే ఉండదు. చాలా ఎనర్జిటిక్‌గా, మెలోడీతో కూడిన ఆడియో ఉంటుంది’’ అని దేవి తెలిపారు. గబ్బర్ సింగ్ తర్వాత పవన్, హరీష్, తాను మళ్లీ కలయికలో ఉన్నందున ఈ సినిమా ఆల్బమ్‌పై భారీ అంచనాలు ఉన్నాయని అన్నారు.
Follow @TBO_Updates
Post a Comment