టెన్షన్ లో ఉన్న RRRకు అమెజాన్ షాకింగ్ ఆఫర్!


జనవరి 7 నుండి RRR వాయిదా వేయడం అనేది మొత్తం చలనచిత్ర పరిశ్రమకు అతిపెద్ద షాక్. అయితే కోవిడ్ యొక్క థర్డ్ వేవ్ జెట్ స్పీడ్ లో దేశాన్ని చుట్టుముట్టడంతో ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇక వచ్చే నెలలో  థియేటర్లలోకి రావడం అసాధ్యం అనిపించడంతో, అమెజాన్ ప్రైమ్ ఇటీవల ఒక అద్భుతమైన ఒప్పందాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

పే-పర్-వాచ్ పద్దతిలో ఆఫర్ ఇచ్చినట్లుగా సమాచారం. ఆ రూట్లో ఈజీగా  ₹ 300 కోట్ల ఆదాయాన్ని ఆర్జించవచ్చని తెలుస్తోంది. అయితే, థియేట్రికల్ అంచనాలతో పోల్చినప్పుడు ఆ వసూళ్లు చాలా తక్కువ కాబట్టి నిర్మాత ఆ ఆలోచనను రిజెక్ట్ చేశాడట. ఈ చిత్రం బాక్సాఫీస్ నుండి 400 కోట్లకు పైగా వసూలు చేయవలసి ఉంది. అప్పుడే మేకింగ్ ఖర్చులు పూర్తి స్థాయిలో తిరిగి పొందబడతాయి, ఇది సింగిల్-పేఅవుట్ లేదా పే-పర్-వాచ్ లో రిలీజ్ చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఇక RRR ను పరిస్థితులు మళ్ళీ నార్మల్ అయినప్పుడే రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఏప్రిల్ పైనే ప్రస్తుతం రాజమౌళి ఫోకస్ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

Post a Comment

Previous Post Next Post