పెద్ద దిక్కుగా ఉండలేను.. ఆ పంచాయితీలే వద్దు: చిరు


ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోగా మెగాస్టార్ చిరంజీవి ఉన్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆయన పలు అంశాల విషయంలో పరిష్కారాలను వెతికే క్రమంలో ఊహించని విధంగా చేదు అనుభవాలు ఎదుర్కొంటున్నారు. ఇక ఆ వివాదాల ప్రభావం వల్లనో ఏమో గాని ఇండస్ట్రీ పెద్ద దిక్కు అనే పదాన్ని తనకు అపాధించవద్దని ఇటీవల ఒక మీటింగ్ లో తేల్చి చెప్పేశారు.

ఇండస్ట్రీ పెద్దరికం పదవిలో నేను వుండలేను అంటూ.. ఆ స్థానం నాకు వద్దని అన్నారు. ఇక అవసరం వ‌స్తే తప్పకుండా సహాయంగా ఉంటానని అది కూడా ఇండస్ట్రీ మంచి కోసం తప్పితే రెండు వర్గాల మధ్యలో ఉండే పంచాయితీలకు రాలేనని అన్నారు.  పెద్ద అనిపించుకోవడం నాకు వద్దు అంటూ.. ఇండస్ట్రీకి  సమస్య వున్నా, కార్మికులకు ఏ సమస్య వున్నా ఎప్పుడు ఆదుకోవడానికి సిద్ధంగా వుంటానని మెగాస్టార్ చిరంజీవి వివరణ ఇచ్చారు.


Post a Comment

Previous Post Next Post