RRR ప్రమోషన్.. ఇప్పటివరకు ఎంత నష్టం?


ఒకేసారి నేషనల్ లెవెల్లో RRR ఫోకస్ అవ్వడానికి లెజెండరీ డైరెక్టర్ SS రాజమౌళి, ఇద్దరు హీరోలు ఎన్టీఆర్ రామ్ చరణ్ చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఈ చిత్రం యొక్క ట్రైలర్ విడుదలైనప్పటి నుండి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ప్రారంభించారు. కానీ సినిమా వాయిదా పడడంతో చాలా వరకు ఆ కష్టం వృధా అనే చెప్పాలి.

సినిమాను మళ్ళీ రిలీజ్ కు సిద్ధం చేస్తే మొదటి నుంచి కాకపోయినా ఎంతో కొంత ప్రమోషన్ అయితే కంటిన్యూ చేయాలి. అయితే ఇప్పటివరకు వారు చేసిన ప్రమోషన్ కోసం ఎంత ఖర్చు చేశారు అనేది హాట్ టాపిక్ గా మారింది.
ట్రైలర్‌ను ప్రచారం చేయడంతో పాటు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లు  బాగానే చేశారు. 
ఇక దేశవ్యాప్తంగా వివిధ నగరాలకు వెళ్లారు. దాదాపు 50+ వీడియో ఇంటర్వ్యూలకు కూడా భారీగానే చెల్లించారు. ఇక RRR బృందం ప్రయాణం కోసం చార్టర్డ్ ఫ్లైట్ మరియు హోటల్ ఖర్చులతో సహా భరిగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రమోషన్ టూర్ కోసం వారు దాదాపు రూ.12-15 కోట్లు ఖర్చు చేసినట్లు సినిమా ప్రొడక్షన్ హౌస్‌కి సన్నిహితంగా ఉన్న కొన్ని వర్గాలు వెల్లడించాయి.

Post a Comment

Previous Post Next Post