ఆర్జీవీకి మంత్రి పేర్ని నాని అపాయింట్మెంట్!


ఆర్జీవీ-పేర్ని నానిల మధ్య ఇటీవల ట్విట్టర్ వార్ ఏ రేంజ్ ల్ జరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఫైనల్ గా వీరిద్దరూ సోమవారం ముఖాముఖిగా కలుసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ వారం మొదట్లో డైరెక్టర్‌తో లైవ్ డిబేట్‌లో పాల్గొన్న పేర్ని నాని, జనవరి 10న అపాయింట్‌మెంట్ ఇచ్చారు. జనవరి 10వ తేదీ మధ్యాహ్నం అమరావతి సచివాలయంలో వీరి సమావేశం జరగనుంది. 

రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. గత కొంతకాలంగా టాలీవుడ్ ప్రముఖులు ప్రభుత్వంతో చర్చలు జరిపి ఎలాగైనా ఇండస్ట్రీలో సమస్యలను పరిష్కరించాలని అనుకున్నారు. టికెట్ల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయని ఎంత చెప్పినా కూడా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఇక రామ్ గోపాల్ వర్మ ట్వీట్లతో బ్యాక్ టూ బ్యాక్ కౌంటర్స్ ఇవ్వడంతో మంత్రి నాని సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. ఇక ఇప్పుడు  ముఖాముఖి చర్చల కోసం సిద్ధమైన పేర్ని నాని ఆ తరువాత ఎలా స్పందిస్తారో చూడాలి.


Post a Comment

Previous Post Next Post