18 సంవత్సరాల పాటు స్నేహితులుగా, దంపతులుగా తల్లిదండ్రులుగా ఒకరికొకరు శ్రేయోభిలాషులుగా.. కలిసి ఉన్న తర్వాత తాను, ఐశ్వర్య విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు నటుడు ధనుష్ ఈరోజు ప్రకటించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య సినిమా దర్శకురాలిగా, నేపథ్య గాయనిగా మంచి గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే.
విడిపోవడాన్ని ప్రకటించడానికి నటుడు ట్విట్టర్‌లో ఇలా షేర్ చేసుకున్నాడు.. 18 సంవత్సరాల పాటు స్నేహితులుగా, దంపతులుగా తల్లిదండ్రులుగా.. ఒకరికొకరు శ్రేయోభిలాషులుగా ఉన్నాము. ఇక మా జీవితంలో వేరువేరుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతూ.. ఐశ్వర్య కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఈ సమయంలో తమకు ప్రైవసీ కావాలని ఈ జంట మీడియాను అభిమానులను ప్రత్యేకంగా కోరింది. వీరికి 15, 11 సంవత్సరాల వయస్సు గల యాత్ర, లింగ అనే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.
Follow @TBO_Updates
Post a Comment