ధనుష్ విడాకులకు అసలు కారణం ఇదేనా? - TollywoodBoxoffice.in

Exclusive Portal for Tollywood Boxoffice

ధనుష్ విడాకులకు అసలు కారణం ఇదేనా?


తన భార్య ఐశ్వర్య రజనీకాంత్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన ధనుష్ ఒక్కసారిగా  అందరిని షాక్ అయ్యేలా చేశాడు. ఈ దంపతులు విడకులపై మొన్నటివరకు కూడా ఎలాంటి రూమర్స్ అయితే రాలేదు. ఇక ఇప్పుడు, చెన్నైలోని కొన్ని మీడియా సంస్థలు ధనుష్ యొక్క విడాకులకు గల కారణాలు ఇవేనని ప్రచారం చేస్తున్నాయి. 

సినీ కెరీర్ లో బిజీగా ఉండడం వలన అతని కుటుంబం కోసం గత కొన్నేళ్లుగా దూరంగానే ఉండాల్సి వస్తుందట.
ధనుష్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రేజ్ అందుకుంటున్నాడు కాబట్టి మిగతా భాషల్లో కూడా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కాబట్టి, అతను ఎక్కువగా బయటే ఉండాల్సి వస్తుందట. దీంతో గత కొన్ని సంవత్సరాలుగా తన కుటుంబం కోసం చాలా సమయం కేటాయించలేదు.  ఇక విడాకులకు ప్రధాన కారణం ఇదే కావచ్చని తమిళనాడులోని మీడియా సంస్థలు చెబుతున్నాయి.