రామాయణ కథ.. మహేష్ ఒప్పుకోకపోతే అతనే?


బాలీవుడ్ చిత్రనిర్మాత మధు మంతెన రామాయణం ఆధారంగా ప్రతిష్టాత్మకమైన పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌ను ప్రకటించి చాలా కాలం అయ్యింది. మేయిన్ క్యాస్ట్ ను ఇంకా ఖరారు చేయలేదు.  తాజా అప్‌డేట్ ప్రకారం, రాముడి పాత్రలో ప్రధాన పాత్ర కోసం మేకర్స్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును లేదా బాలీవుడ్ అగ్ర నటుడు రణబీర్ కపూర్‌ని ఫైనల్ చేయాలని ఆలోచిస్తున్నారట.  

ఈ ఇద్దరు అగ్ర నటులతో మేకర్స్ సమావేశాలు నిర్వహించారు. కానీ ఇంకా ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.  ఈ సినిమా పాన్-ఇండియన్ ప్రయత్నం కావడంతో నిర్మాతలు అన్ని భాషల్లో బలమైన ఇమేజ్ ఉన్న నటీనటులను పరిశీలిస్తున్నారు. దంగల్‌ ఫేమ్‌ నితీష్‌ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

 రవి ఉద్యవార్ కథ అంధించనున్నారు. ఇక 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా రామాయణం ప్రాజెక్టును నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ఈ చిత్రంలో ప్రధాన విలన్‌గా నటించడానికి ఒప్పికున్నట్లు సమాచారం.

Post a Comment

Previous Post Next Post