రవితేజతో నటించడానికి ఎవరు ఒప్పుకోవట్లేదా? - TollywoodBoxoffice.in

Exclusive Portal for Tollywood Boxoffice

రవితేజతో నటించడానికి ఎవరు ఒప్పుకోవట్లేదా?


విక్రమ్ వేద తమిళంలో భారీ బ్లాక్ బస్టర్ మూవీ. మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో నటించిన ఈ యాక్షన్ డ్రామా విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఇక తెలుగులో మాస్ మహారాజా రవితేజ కొన్నేళ్ల క్రితమే ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని భావించారు. ఇక ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించాలని అనుకున్నారట.  

ఒరిజినల్ వెర్షన్‌లో సేతుపతి చేసిన వేధ పాత్రను పోషించడానికి రవితేజ ఆసక్తిగా ఉన్నాడట. అయితే విక్రమ్ పాత్ర కోసం మేకర్స్ ఇతర ఎ-లిస్ట్ హీరోలను సంప్రదించడానికి ప్రయత్నించారట. కాని ఎవరూ ఆ పాత్ర చేయడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. వారు కూడా వేద పాత్రను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఒరిజినల్ వెర్షన్ నిర్మాత శశికాంత్ చాలా కాలంగా తెలుగు వెర్షన్ రీమేక్ రైట్స్‌ని తన వద్దే ఉంచుకున్నారు.  ఇటీవల హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ లతో బాలీవుడ్‌లో రీమేక్ ను ప్రారంభించాడు.