రిపబ్లిక్ డే సందర్భంగా, ఉపాసన తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఒక ఫోటోను షేర్ చేసింది. దేవుడి విగ్రహాలకు బదులు జనంతో నిండిన దేవాలయం 'గోపురం' ఫోటోను ఆమె పోస్ట్ చేసింది. చిత్రానికి క్యాప్షన్ ఇస్తూ, ఆమె ఇలా రాసింది.. అవరోధాలు లేకుండా క్రియాశీల ప్రమేయంతో మరింత సహనంతో కూడిన దేశాన్ని నిర్మించడంలో నిమగ్నమై ఉందాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. అని తెలియజేసింది.
అంతే కాకుండా ఫోటోలో తనను, రామ్ చరణ్ ని గుర్తించగలరా అని ఆమె తన ఫాలోవర్స్ ను కూడా అడిగింది. ఈ చిత్రాన్ని తన తల్లి శోభా కామినేని తనకు పంపినట్లు వెల్లడించింది. ఇక ఒక వర్గం ప్రజలు ఈ చిత్రాన్ని అంగీకరించడం లేదు. వారి మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు ఉపాసనపై మండిపడ్డారు. "మీరు ఇతర మత పుణ్యక్షేత్రాలపై కూడా అదే సవాళ్లను వేయగలరా" అని ఒక నెటీజన్ ప్రశ్నించాడు. అంతే కాకుండా మన సంస్కృతికి గౌరవం చూపండి... ఇది ఆమోదయోగ్యం కాదు... మన సంస్కృతి వారసత్వంతో దేశభక్తిని కలపవద్దు" అని మరొక నెటిజన్ తెలిపారు.
Follow @TBO_Updates
Post a Comment