హైదరాబాద్ ఫ్యాన్స్ షోల థియేటర్ దగ్ధం!


హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతంలోని శివపార్వతి థియేటర్‌ ఈరోజు తెల్లవారుజామున దగ్ధమైంది. ఘటనతో వెంటనే మూడు ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే అంతకంటే ముందే థియేటర్ పూర్తిగా దెబ్బతింది. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని నిర్వాహకులు చెబుతున్నారు. శివపార్వతి థియేటర్ కు చాలా చరిత్ర ఉంది. 25 ఏళ్లకు పైగా ఆ థియేటర్స్ లో ఫ్యాన్స్ షోలు ప్రదర్శిస్తూ వస్తున్నారు.

ఇక నిన్న సెకండ్ షో పూర్తయిన తర్వాత అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.  తెల్లవారుజామున 2:30 నుంచి 3 గంటల మధ్య ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.  స్క్రీన్, ఫర్నీచర్, పైకప్పు, గోడలు పూర్తిగా దెబ్బతినడంతో థియేటర్ మొత్తం కాలిపోయింది.  ఈ థియేటర్‌లో నాని నటించిన శ్యామ్‌ సింగరాయ్‌ సినిమాను ఇటీవల ప్రదర్శించారు.  ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Post a Comment

Previous Post Next Post