మరో లక్కీ ఛాన్స్ కు దగ్గరలో రష్మీక?


నేషనల్ క్రష్ గా చలామణి అవుతున్న రష్మిక మందన్న మొత్తానికి పుష్ప సినిమాతో బిగ్ హిట్ అయితే కొట్టేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద 300కోట్ల క్లబ్ లో చేరినట్లు నిర్మాతలు సంతోషంగా ప్రచారాలు మొదలు పెట్టారు. ఏదేమైనా కూడా పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ పాన్ ఇండియా దృష్టిని ఆకర్షించింది.

ఇక అమ్మడికి ఇటీవల మరో లక్కీ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. శివకార్తీకేయన్ 20వ ప్రాజెక్ట్ తెలుగు తమిళ్ ద్విభాషా చిత్రంగా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో రష్మికను సెలెక్ట్ చేసుకునే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం ఆప్షన్ గానే పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ చర్చలు సక్సెస్ అయితే రష్మీకకి లక్కీ ఆఫర్ అనే చెప్పాలి. ఆ సినిమాను జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ డైరెక్ట్ చేయనున్న విషయం తెలిసిందే.


Post a Comment

Previous Post Next Post