రామ్ చరణ్ RC15, JR ఎన్టీఆర్ 30 వ సినిమాలపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. RRR అనంతరం ఈ ఇద్దరు హీరోలు కూడా సోలోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమాలు కావడంతో బాక్సాఫీస్ వద్ద ఎవరు ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంటారు అనేది హాట్ టాపిక్ గా మారింది
RC15 ఇప్పటికే షూటింగ్ మొదలయ్యింది, NTR30 తదుపరి రెండు నెలల్లో స్పీడ్ అందుకుంటుందట. అయితే ఇప్పుడు, ఈ రెండు సినిమాలు 2023 సంక్రాంతికి విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ రెండు పాన్-ఇండియా నిర్మాతలు సంక్రాంతి విడుదల స్లాట్ ను లాక్ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. మరి స్టార్ హీరోలు ఆ విషయంలో ఎలా ఆలోచిస్తారో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment