Subscribe Us

ధనుష్, ఐశ్వర్య మళ్ళీ కలుస్తారా?


ఇటీవల నటుడు ధనుష్, అతని భార్య ఐశ్వర్య రజనీకాంత్ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ వార్త అభిమానులకు, సినీ ప్రియులకు షాక్‌గా మారింది. అయితే  స్టార్ కపుల్ సమస్యను పరిష్కరించడానికి పెద్దలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.  తన కొడుకు ధనుష్ విడాకులపై ధనుష్ తండ్రి కస్తూరి రాజా స్పందించారు.  కుటుంబ కలహలు భార్యాభర్తల మధ్య జరగడం సర్వ సాధారణం అని కస్తూరి రాజా చెప్పాడు. 

ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ హైదరాబాద్‌లో ఉన్నారని, వారితో మాట్లాడి అవసరమైన సలహాలు ఇచ్చానని చెప్పారు. ఇక రజనీకాంత్ తో కూడా మాట్లాడడం జరిగిందని చెన్నై వచ్చిన తరువాత మరోసారి ఇరువురితో మాట్లాడడం జరిగుతుందని అన్నారు. ఇక ధనుష్ మరియు ఐశ్వర్య ఇద్దరూ తమ వృత్తిపరమైన జీవితాలతో బిజీగా ఉన్నారని, ఒకరితో ఒకరు గడపడానికి సమయం లేదని కొన్ని అగ్ర మీడియా పోర్టల్‌లు వెల్లడించాయి. ఆ కారణంగానే వారు విడాకుల కోసం వెళ్ళారట. ఇక రజనీకాంత్ కూడా ఇద్దరితో ముఖాముఖిగా మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Post a Comment

0 Comments