కళ్యాణ్ దేవ్.. మరో సినిమా కూడా పోయినట్లే?


వ్యాపార కుటుంబానికి చెందిన కళ్యాణ్ దేవ్ మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల శ్రీజ అతని నుంచి దూరంగా ఉంటున్నట్లు టాక్ వైరల్ గా మారింది. రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా ఈ జంట ఇంతవరకు అఫీషియల్ క్లారిటీగా ఇవ్వలేదు.

ఇక కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి సినిమాకు మెగా హీరోలు ఎవరు కూడా సింగిల్ ట్వీట్ వేయకపోవడం కూడా పలు అనుమానాలను కలుగజేసింది. ఇక ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకోగా కళ్యాణ్ మరో సినిమా కిన్నెరసాని ప్రేక్షకుల ముందుకు వస్తుందా లేదా అనేది వైరల్ గా మారింది. మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా కళ్యాణ్ దేవ్ నటుడిగా నిలవడం చాలా కష్టమైన పని.  అతని నటనా నైపుణ్యాలు కూడా చాలా తక్కువే. ఇక కిన్నెరసాని నిర్మాత రామ్ తాళ్లూరు పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుడు. ఇక ఆ నిర్మాత సినిమాని థియేటర్లలో విడుదల చేయడం కష్టంగా అనిపించవచ్చు. ఓటీటీ లోనే ఆ సినిమా రావచ్చని సమాచారం.


Post a Comment

Previous Post Next Post