ముగిసిన రమేష్ బాబు అంత్యక్రియలు.. తట్టుకోలేకపోయిన కృష్ణ!


అలనాటి నటుడు, నిర్మాత, నటుడు కృష్ణ కుమారుడు జి. రమేష్ బాబు(56) కాలేయ సంబంధిత వ్యాధితో నిన్న కన్నుమూశారు.  ఆయన హఠాన్మరణం ఇండస్ట్రీని కుదిపేసింది. ప్రజల అంతిమ నివాళులర్పించేందుకు ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మహేష్ బాబు సోదరుడి పార్థివదేహాన్ని పద్మాలయా స్టూడియోస్‌లో ఉంచారు. 

ఇక మధ్యాహ్నం 12 గంటల నుంచి మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగగా.. 2 గంటల లోపే అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇక కడసారి పెద్ద కుమారుడిని చూసి కృష్ణ విలపించారు. అందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు కూడా కంటతడి పెట్టిస్తున్నాయి. ఓమిక్రాన్ భయం మధ్య, ఘట్టమనేని కుటుంబం తమ శ్రేయోభిలాషులు మరియు అభిమానులను కోవిడ్ -19 నిబంధనలను పాటించాలని ముందుగానే అభ్యర్థించారు.


Post a Comment

Previous Post Next Post