నాగ్ అశ్విన్ - ప్రభాస్ కాంబినేషన్లో రానున్న బిగ్గెస్ట్ విజువల్ వండర్ ప్రాజెక్ట్ K పై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఈ సినిమాతో ఎలాగైనా ప్రభాస్ హాలీవుడ్ రేంజ్ కు వెళ్లిపోవడం కాయమని నిర్మాత సి.ఆశ్వినీ దత్ క్లారిటీ ఇచ్చేశారు. దాదాపు రెండున్నారేళ్లు దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంతో కష్టపడి ఆ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు వివరించారు.
ఇక ప్రాజెక్ట్ K ఇప్పటికే రెండు కీలక షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుందని గ్రాఫిక్స్ పనులు ప్లానింగ్ కూడా మొదలైనట్లు అన్నారు. ఇక ఫిబ్రవరిలో మరొక షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని ఎలాంటి బ్రేక్ రాకపోతే ఈ ఏడాది మొత్తం షూటింగ్ పార్ట్ ఫినిష్ అవుతుందని తెలియజేశారు. ఒకవేళ షూటింగ్ పనులు ప్రస్తుతం అనుకున్న ప్లాన్ ప్రకారం కొనసాగితే మాత్రం 2023 మర్చిలోనే సినిమా విడుదల అవుతుందని కోవిడ్ వల్ల ఆలస్యం అయితే రెండు మూడు నెలలు అటు ఇటుగా సినిమా రావచ్చని సి.ఆశ్వినీ దత్ తెలియజేశారు.
Follow @TBO_Updates
Post a Comment