అఖండ గ్రూప్ తో శ్రీకాంత్ అడ్డాల?


అసురన్ రీమేక్ నారప్ప సినిమాతో పరవాలేదు అనిపించిన శ్రీకాంత్ అడ్డాల మళ్ళీ కమ్ బ్యాక్ ఇవ్వాలని ప్రయత్నాలు మొదలు పెట్టాడు. చిన్న సినిమాతోనే మళ్ళీ కొత్త బంగారు లోకం తరహాలో బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఆ మధ్య నారప్ప ప్రమోషన్ లో మెగాస్టార్ కోసం కూడా ఒక కథ సిద్ధం చేసినట్లు చెప్పాడు.

ఇక ప్రస్తుతం చిరంజీవి మిగతా సినిమాలతో బిజీగా ఉండడం వలన శ్రీకాంత్ ఫామ్ లోకి వచ్చే విధంగా మినీ హిట్ అందుకోవాలని అఖండ టీమ్ తో కలిసి వర్క్ చేయబోతున్నాడట. అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో వారి బంధువుల అబ్బాయితోనే సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మళ్ళీ కొత్త బంగారు లోకం తరహాలోనే సక్సెస్ అందుకోవాలని ఒక డిఫరెంట్ లవ్ స్టోరీని టచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post