సమంత సినిమా కోసం 3కోట్ల సెట్?


హరి - హరీష్ ఇద్దరు సంయుక్త దర్శకత్వంలో రూపొందుతున్న సమంతా ‘యశోద’ సినిమా మరోసారి మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. శ్రీదేవి మూవీస్ పతాకంపై విలాసవంతమైన నిర్మాణ విలువలతో ఈ సినిమా రూపొందుతోంది. న్యూ-ఏజ్ థ్రిల్లర్ గా విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలో హైలెట్ కానున్నాయట. 

ఇక కథకు మరింత రియాలిటీగా ఉండాలని సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అశోక్ తో భారీ సెట్ ని నిర్మించారట. దాని కోసం దాదాపు 3 కోట్ల వరకు ఖర్చు అయినట్లు టాక్. భారీగా 7-స్టార్ హోటల్ మోడల్ సెట్‌లను నిర్మించారు. అందుకు సంబంధించిన ఫొటోస్ కూడా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్ & మురళీ శర్మ కూడా నటిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post