ఒకప్పటి స్టార్ కమెడియన్ తో గౌతమ్ మీనన్ కామెడీ మూవీ


గౌతమ్ మీనన్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు, యాక్షన్ ప్యాక్డ్ కాప్ డ్రామాలు తీయడంలో స్పెషల్ అని అందరికి తెలిసిందే.  తన కెరీర్‌లో ఎప్పుడూ అతను కామెడీ బ్యాక్ డ్రాప్ లో ప్రయత్నించలేదు.  ఫైనల్ గా ఈ దర్శకుడు ఒక హాస్య కామెడీ రూపొందించే ప్లాన్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన గౌతమ్ మీనన్.. తాను కామెడీ సినిమా కోసం తమిళ లెజెండరీ కమెడియన్ వడివేలుతో చర్చలు జరుపుతున్నానని చెప్పాడు. ఇక చాలా గ్యాప్ తర్వాత వడివేలు ఇటీవలే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు.  ఖచ్చితంగా గౌతమ్ మీనన్ అతనితో సినిమా చేస్తే ఆ ప్రాజెక్ట్ కోలీవుడ్‌లో చాలా సంచలనం సృష్టిస్తుంది అని చెప్పవచ్చు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
ప్రస్తుతం, గౌతమ్ మీనన్ శింబుతో ఒక సినిమా ఫినిష్ చేస్తున్న విషయం తెలిసిందే.

Post a Comment

Previous Post Next Post