మహేష్ - రాజమౌళి కాంబో.. కరెన్సీ నోట్లతో ఏం చేస్తున్నారు?


మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తో బిగ్గెస్ట్ పాండ్యా సినిమాలో నటించబోతున్న విషయం తెలిసిందే ఆ సినిమా కోసం కూడా దాదాపు 300 కోట్లకు పైగా ఖర్చు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక మహేష్ బాబు రేంజ్ కి తగ్గట్టు గానే రచయిత విజయేంద్రప్రసాద్ కూడా పవర్ఫుల్ కథను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఆయన సోదరుడి కుమార్తె mm శ్రీలేఖ పోస్ట్ చేసిన ఒక ఫోటో ద్వారా మహేష్ బాబు కు సంబంధించిన ప్రాజెక్టు పై ఒక టాక్ వైరల్ గా మారింది.


శ్రీలేఖ కూడా ఇండస్ట్రీలో సంగీత దర్శకులు గా మంచి క్రేజ్ అందుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఆమె రాబోయే మహేష్ రాజమౌళి సినిమాలకు సంబంధించి ఆల్ ది బెస్ట్ చెబుతూ విజయేంద్రప్రసాద్ గారితో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఆయన టేబుల్ మీద కథ రాస్తున్న ప్యాడ్, ఎదురుగా కరెన్సీ నోట్ల పెట్టుకోవడం విశేషం. ఆ విధంగా చెల్లాచెదురుగా ఎందుకు నోట్లను పెట్టుకున్నారు అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. బహుశా కరెన్సీ కాన్సెప్ట్ లో ఏదైనా డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారో ఏమో అనే అనుమానం కలుగుతోంది.


Post a Comment

Previous Post Next Post