జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత కొరటాల శివ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా సోషల్ డ్రామాగా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. అయితే ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ఒక కొత్త లుక్లో కనిపించబోతున్నట్లు సమాచారం.
RRR సినిమాలో ఎన్టీఆర్ పవర్ ఫుల్ గా కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో మాత్రం ఆ స్థాయిలో కాకుండా కొంచెం తక్కువ రేంజ్ లోనే ఫిట్నెస్ లో ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్నాడట. సినిమా కథకు తగ్గట్టుగా ఒక కామన్ మ్యాన్ ఎలా ఉంటాడో అలా ఉండాలని, అంతేకాకుండా కామన్ మ్యాన్ పవర్ఫుల్ సిస్టంను ఎదిరిస్తే ఎలా ఉంటుంది అనే తరహాలో క్యారెక్టర్ డిజైన్ చేస్తున్నారట. దానికి తగ్గట్లుగా హీరో ఎలివేషన్ కు తగ్గట్టుగా ఉండేవిధంగా కనిపిస్తే చాలు అని కొరటాల చెప్పారట. అందుకే కొరటాల శివ ఆలోచనలకు తగ్గట్టుగా ఎన్టీఆర్ ఒక మీడిమ్ రేంజ్ లోనే కొత్తగా కనిపించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment