అక్కినేని హీరోలు మల్టీస్టారర్ కథలు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు అని చెప్పవచ్చు
మనం సినిమా తరువాత మళ్లీ అలాంటి సినిమా చేయలేదు. చేయాలని ఉన్నప్పటికీ సరైన స్క్రిప్ట్ దొరకడం లేదు. కానీ నాగార్జున మాత్రం వేరువేరుగా తన ఇద్దరు కొడుకుల తో సినిమాలు చేయాలని ఆసక్తిని చూపిస్తున్నారు. ఇటీవల నాగచైతన్యతో బంగార్రాజు సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.
ఇక అక్కినేని అఖిల్ తో కూడా ఎలాగైనా మరో మంచి సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. ఇటీవల చిరంజీవి గాడ్ ఫాదర్ దర్శకుడు మోహన్ కృష్ణ అక్కినేని అఖిల్ నాగార్జున కోసం ప్రత్యేకంగా ఒక స్టోరీ లైన్ వినిపించినట్లు సమాచారం. నాగార్జునకు కూడా నచ్చడంతో పూర్తి కథ సిద్ధమైన తర్వాత మరొక సారి చర్చలు జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ ప్రాజెక్టుపై ఎప్పుడు ఎనౌన్స్మెంట్ ఇస్తారో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment