భీమ్లా ఈవెంట్.. త్రివిక్రమ్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారంటే?


హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిన్న రాత్రి జరిగిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. త్రివిక్రమ్ లేకుండా భీమ్లా నాయక్ లేదు అన్నారు. పవన్ మాత్రమే కాదు. దాదాపు అందరు అదే మాట అన్నారు. ఇక పవర్ ఫుల్ గా మెస్మరైజింగ్ స్పీచ్‌లకు పేరుగాంచిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ భీమ్లా నాయక్ ఈవెంట్‌లో ఎలాంటి ప్రసంగం చేయలేదు.  

భీమ్లా నాయక్ సినిమా మొదలైనప్పటి నుండి, త్రివిక్రమ్ సినిమాలో ఇన్వాల్వ్ అయినందుకు ఒక వర్గం వారి నుంచి కొన్ని కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. సినిమాకు దర్శకుడు సాగర్ కె చంద్ర అయినప్పటికీ త్రివిక్రమ్ అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాకి స్క్రిప్ట్ రైటర్ అతనే అయినప్పటికీ, సినిమా కోసం దర్శకుడిగా ఆయనే ఉన్నారని కామెంట్స్ వచ్చాయి. ఇక  త్రివిక్రమ్ వేదికపై మాట్లాడకుండా ఈవెంట్‌లో  డైరెక్టర్ సాగర్ ను హైలెట్ చేసేందుకు అలా సైలెంట్ గా ఉన్నారని తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post