ఎన్టీఆర్ తప్ప మరో హీరో వద్దట?


జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత వరుస సినిమాలతో బిజీ ఇవ్వబోతున్నాడు.. ఒక్కసారి ఆ మార్కెట్ లోకి వెళితే మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోకుండా సినిమాలు చేసేందుకు తారక్ అడుగులు వేస్తున్నాడు. అయితే ఈ హీరో కోసం కొంతమంది దర్శకులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ తో ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు

ఎన్టీఆర్ ఇ ప్రాజెక్టు అనంతరం వీలైనంత త్వరగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నిల్ తో కూడా ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కూడా ఎన్టీఆర్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ కథను సిద్ధం చేసిన బుచ్చిబాబు ప్రస్తుతం ఎన్టీఆర్ తో బిజీగా ఉన్నప్పటికీ కూడా మరొక స్క్రిప్టుపై ఫోకస్ పెట్టకుండా జూనియర్ ఎన్టీఆర్ తో చేయాల్సిన ప్రాజెక్టు పైనే శ్రద్ధ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఉప్పెన అనంతరం అతను మరోక సినిమా చేయలేదు. ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు కాబట్టి మరొక చిన్న సినిమా చేసుకోమని కొందరు సలహాలు ఇస్తున్నప్పటికీ కూడా బుచ్చిబాబు అసలు వెనక్కి తగ్గకుండా తన తదుపరి సినిమా ఎన్టీఆర్ తో చేయాలని మొండి పట్టు పట్టినట్లు సమాచారం.

Post a Comment

Previous Post Next Post