గరికపాటి చెప్పిన కొద్దిసేపటికే పుష్ప రియల్ సీన్..


టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాకుండా పుష్ప ఇతర భాషల్లో కూడా భారీ స్థాయిలో బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక సినిమాకు ప్రశంసలు ఎన్ని వచ్చాయో కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఇటీవల ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఆ సినిమాను చూసి యువత పెడదోవ పట్టే అవకాశం ఉందని కామెంట్ చేశారు. 


ఇక ఆయన చెప్పిన కొన్ని గంటల్లోనే రియల్ సీన్ కూడా వార్తల్లో నిలవడం విశేషం. బెంగళూరు లోని ఒక వ్యక్తి పుష్ప సినిమా తరహాలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. కర్ణాటక సరిహద్దుల్లో పోలీసులు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తర్వాత సినిమా తరహాలోనే అతను కూడా వ్యాన్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డట్లు తెలిసింది. ఇక పోలీసులు దాదాపు రెండున్నర కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలతో పాటు 10 లక్షల విలువైన వ్యాన్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


Post a Comment

Previous Post Next Post