రామ్ - బోయపాటి ప్రాజెక్ట్.. స్టోరీ ఇదేనా?


దర్శకుడు బోయపాటి శ్రీనుతో యంగ్ హీరో రామ్ పోతినేని ఇటీవల కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించాడు.  ఇంకా పేరు పెట్టని ఈ పాన్-ఇండియా చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారు. ఇక అల్ట్రా మాస్ సినిమాలు తీయడంలో బోయపాటికి మంచి పేరుంది.  ఇక 2019లో ఇస్మార్ట్ శంకర్ తో రామ్ కూడా మాస్ యాంగిల్ మరో హిట్ కొట్టాడు. అదే అతని కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌. 

ఆ తర్వాత రామ్ రెడ్ సినిమాతో వచ్చినా అది బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఇక ఇప్పుడు లింగుసామి దర్శకత్వంలో ది వారియర్‌తో వస్తున్నాడు.  ఇది ఇస్మార్ట్ శంకర్ లాగా ‘మాస్’ తరహాలో ఉంటుందో లేదో ఇప్పటికీ తెలియదు. ఇక ఇస్మార్ట్ శంకర్ కంటే బోయపాటి భారీ మాస్ అంశాలతో రామ్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఒక కాలేజ్ కుర్రాడు ఇండియా లెవెల్ లో ఉన్నటువంటి బడా రౌడీలను ఏ రేంజ్ లో ఎదిరించాడు అనేది సినిమాలో మేయిన్ హైలెట్ పాయింట్ అనే టాక్ వస్తోంది. మీరా జాస్మిన్ పాత్ర ఈ సినిమాలో కీలకం కానున్నట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post