భీమ్లా నాయక్ కోసం త్రివిక్రమ్.. ఆఖరి వరకు తగ్గట్లేదుగా!


దర్శకుడు సాగర్ కె చంద్ర “భీమ్లా నాయక్” షూటింగ్ ని ఇటీవల మొత్తానికి ఫినిష్ చేశాడు. అయితే సాగర్ కంటే కూడా ఈ సినిమా కోసం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రొడక్షన్ వర్క్ వరకు సాగర్ చూసుకుంటూ ఉండగా మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ చూసుకుంటున్నాడు.

ఇండియాలోనే అత్యంత హై టెక్నాలజీ సౌండ్ ఇంజనీర్ షాదాబ్ రయీన్. థమన్ కు అన్ని పనుల్లో కుడి భుజంగా ఉండేవాడు. ఇక అతనితో కలిసి ఇటీవల త్రివిక్రమ్ సౌండ్ మిక్సింగ్ వంటి పనులను ఫినిష్ చేశాడు. ఫిబ్ర‌వ‌రి 25న సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా మిక్సింగ్ వర్క్ నిన్నటి వరకు కొనసాగినట్లు తెలుస్తోంది.  త్రివిక్రమ్ పర్యవేక్షణలో, 7.1, 5.1 డాల్బీ అట్మాస్ మిక్సింగ్ చాలా బాగా వస్తోందని అంటున్నారు.  ఇక ప్రతిభావంతులైన సౌండ్ ఇంజనీర్ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్లలో ఎనర్జిటిక్ సౌండ్ అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు.

త్రివిక్రమ్ సినిమాకి డైలాగ్స్ మాత్రమే అందించినప్పటికీ, ప్రతి ఒక్క పాట కూర్పు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం, ఎడిటింగ్, రిలీజ్ ప్లాన్స్‌తో పాటు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను దాదాపు దర్శకుడు, నిర్మాతలానే చూసుకుంటున్నాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  .
హారిక హాసిని నిర్మాత చినబాబు, సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ కి చెందిన వంశీతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా అలాగే మంచి మిత్రుడు పవన్ కళ్యాణ్ సినిమా కావున, వారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ త్రివిక్రమ్  ముందుంటాడనడంలో సందేహం లేదు.

Post a Comment

Previous Post Next Post