మురారి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నార్త్ బ్యూటీ సోనాలి బింద్రే తెలుగు ప్రేక్షకులు ఏ మాత్రం మర్చిపోలేరు అనే చెప్పాలి. ఖడ్గం, మన్మధుడు, ఇంద్ర, శంకర్ దాదా ఎంబిబిఎస్ ఇలా వరుస విజయాలతో సోనాలి బింద్రే సెలెక్ట్ చేసుకునే కథలు అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.
ఇక 2004 తర్వాత మళ్లీ కనిపించని సోనాలి మధ్యలో క్యాన్సర్ బారిన పడి వీదేశాలకు వెళ్లి చికిత్స చేసుకుంది. ఇక క్యాన్సర్ నుంచి కోలుకున్న అనంతరం సోనాలి బింద్రే హిందీలో రియాలిటీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇక రీసెంట్ గా ఆమెకు ఒక తెలుగు ఆఫర్ రావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కొరటాల శివ ఎన్టీఆర్ తో చేయబోయే పాన్ ఇండియా సినిమా కోసం సోనాలి బింద్రేను ఒక ముఖ్యమైన పాత్ర కోసం సంప్రదించినట్లు సమాచారం. ఆ పాత్ర నచ్చడంతో సోనాలి బింద్రే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Follow @TBO_Updates
Post a Comment