రూ.300 కోట్ల రాధేశ్యామ్ vs రూ.10 కోట్ల సినిమా.. వ్వాటే ఫైట్!


ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కశ్మీర్లో హిందూ పండిట్ల మీద ముస్లిం ఛాందసవాదులు జరిపిన అఘాయిత్యాల చుట్టూ తిరిగే ఈ కథలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాకు బడ్జెట్ 10కోట్లు మాత్రమే కాగా 300 కోట్ల ఖర్చుతో తీసిన రాధే శ్యామ్ కు పోటీగా నిలుస్తోంది.

బాలీవుడ్ లో రాధే శ్యామ్ మొదటి మూడు రోజుల్లో 14కోట్ల నెట్ వసూళ్లను అందుకుంది. ఇక ది కశ్మీర్ ఫైల్స్ ఫస్ట్ వీకెండ్ లో మాత్రం 26.5కోట్లను అందుకోవడం విశేషం.  హైదరాబాద్ లో కూడా షోలు హౌస్ ఫుల్ గా నడుస్తున్నాయి. దానికి తోడు రాధే శ్యామ్ కు కాస్త నెగిటివ్ టాక్ రావడం కూడా ఆ సినిమాకు బాగా కలిసొచ్చింది. ఏదేమైనా ది కశ్మీర్ ఫైల్స్ బాక్సాఫీస్ వద్ద రోజురోజుకు వసూళ్లను పెంచుకోవడంతో రాధే శ్యామ్ పై ప్రభావం చూపిస్తోంది.


Post a Comment

Previous Post Next Post