రాధే శ్యామ్ ఐడియా.. ఫస్ట్ రిజెక్ట్ చేసిన హీరో అతనే?


రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా మొత్తానికి భిన్నమైన టాక్ తో బాక్సాఫీస్ వద్ద చాలా కష్టపడుతూ ముందుకు సాగుతోంది. ఏదేమైనా కనీసం సాహో తరహాలో కూడా ఈ సినిమా హిందీ లో కలెక్షన్స్ అందుకోలేక పోతుంది.. అయితే రాధే శ్యామ్ ఐడియాను ఇదివరకే ఒక సీనియర్ హీరోకు వినిపించగా అతను రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అతను మరెవరో కాదు దగ్గుబాటి హీరో వెంకటేష్ అని సమాచారం.

రాధే శ్యామ్ ఐడియా మొదట టాలెంటెడ్ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటికి వచ్చిందట. మొదట కథను అంతగా డెవలప్ చేయకుండా ఐడియా గురించి వెంకటేష్ కు చెప్పాడట. కానీ వెంకటేష్ వినగానే మొదట చేయాలి అని ఇంట్రెస్ట్ చూపినప్పటికి ఆ తర్వాత మళ్లీ రిస్కు చేయడం ఎందుకు అని రిజెక్ట్ చేశాడట. ఇక ఈ దర్శకుడి దగ్గర పలు సినిమాలకు సహాయ దర్శకుడిగా పని చేసిన రాధాకృష్ణ తను దర్శకుడిగా మారిన తరువాత ఆ ఐడియా తీసుకొని తనే సొంతంగా కథను డెవలప్ చేసుకున్నాడు. దాదాపు ఆరేళ్ల పాటు ఆ సినిమా కథను డెవలప్ చేసుకున్నట్లు రాధాకృష్ణ ఇంటర్వ్యూ లలో తెలియజేశాడు.


Post a Comment

Previous Post Next Post