ప్రభాస్ చరణ్ తారక్.. ఒకేసారి వస్తే బాక్సాఫీస్ తట్టుకుంటుందా?


టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సంక్రాంతి సీజన్ అనేది చాలా ముఖ్యం అని అందరికీ తెలిసిన విషయమే. ఆ సమయంలో కాస్త పాజిటీవ్ టాక్ అందుకున్న సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద భారీ స్థాయిలో లాభాలు అందిస్తూ ఉంటాయి. అందుకే స్టార్ హీరోల సినిమాలు ఎలాంటి పోటీ ఉన్నా కూడా సంక్రాంతి బరిలోకి దిగేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ముగ్గురు హీరోలు రాబోయే సంక్రాంతికి ఫ్యాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్ బరిలోకి దిగితే ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

మహాశివరాత్రి సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను ప్రకటించడం జరిగింది. 13 జనవరి 2023 సంక్రాంతికి సినిమాను విడుదల చేయనున్నట్లు వివరణ ఇచ్చారు. అయితే ఇంతకు ముందే రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా అదే సమయానికి విడుదల చేయబోతున్నట్లు గా చెప్పారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాను కూడా 2023 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ ముగ్గురు ఒకేసారి వస్తే బాక్స్ ఆఫీస్ తట్టుకుంటుంది అనేది అందరిలో సందేహం కలుగుతోంది. తప్పకుండా పోటీ నుంచి ఎవరో ఒకరు తప్పు కావడం ఖాయమని చెప్పవచ్చు.


Post a Comment

Previous Post Next Post