టెన్షన్ తట్టుకోలేక అక్కడికి వెళ్లిపోయిన ప్రభాస్


రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా అనంతరం రాధే శ్యామ్ సినిమాతో ఎలాంటి టెన్షన్ లేకుండా సక్సెస్ అందుకుంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా కూడా ఓ వర్గం ప్రేక్షకుల నుంచి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ అన్ని వర్గాల ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే ఈ సినిమా విడుదలకు ముందు నుంచే ప్రభాస్ టెన్షన్ లో ఉన్నట్లు ఒక ఇంటర్వ్యూ లో చెప్పేసాడు.

సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎప్పుడు టెన్షన్ తగ్గుతుందా అని ఆలోచిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అయితే ప్రభాస్ ఇటీవల చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాల్గొంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ కనిపించలేదు. అందుకు కారణం ప్రభాస్ సినిమా విడుదలకు ఒకరోజు ముందే ఇటలీ వెళ్లిపోయినట్లు గా తెలుస్తోంది  కాస్త విశ్రాంతి కావాలి అని ప్రభాస్ తదుపరి సినిమా షూటింగ్ మొదలయ్యే వరకు అక్కడే ఉండడానికి ప్లాన్ రెడీ చేసుకున్నట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post