ప్రభాస్ రాధే శ్యామ్ ఈ నెల 11న వెండితెరపైకి రానుంది. ఈ ఇంటెన్స్ లవ్ డ్రామా కోసం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ఇటీవల జోరందుకుంది. అయితే ఇప్పుడు, రాధే శ్యామ్‌కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన బజ్ ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. రాజమౌళి రాధే శ్యామ్ సినిమాకు సంబంధించిన స్పెషల్ షోను వీక్షించినట్లుగా తెలుస్తోంది.
అయితే రాజమౌళి కొన్ని సీన్స్ ను చూసిన అనంతరం ఫైనల్ కాపీకి కొన్ని మార్పులను సూచించాడని తెలుస్తోంది. లాస్ట్ ఎడిటింగ్ లో నుండి కొన్ని సన్నివేశాలు కట్ చేశారని కూడా టాక్ వస్తోంది. రాజమౌళి ఆ సీన్స్ సినిమా మూడ్ ను చెడగొట్టే ప్రమాదం ఉందని తన సలహాలు చెప్పాడట. ఇక ప్రభాస్ కూడా రాజమౌళి నిర్ణయాన్ని సీరియస్ గా తీసుకొని వాటిని తొలసించేలా చేసినట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment