మహేష్.. ముందే పాన్ ఇండియా స్టంట్ అవసరమా?


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు కేవలం సౌత్ ఇండస్ట్రీ లోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ ఉంది అని చాలాసార్లు రుజువైంది. మహేష్ డబ్బింగ్ సినిమాలతో పాటు స్పెషల్ యాడ్స్ కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది అనే చెప్పాలి. అయితే రాజమౌళి కంటే ముందే మహేష్ బాబు పాన్ ఇండియా రూట్లో వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అది కూడా సర్కారు వారి పాట సినిమాను మిగతా భాషల్లో కూడా విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట.

రీసెంట్ గా తమిళ్ లో విడుదల చేయాలని ఫిక్స్ అయిన చిత్ర యూనిట్ హిందీ విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఇక కన్నడలో మహేష్ కు ఎలాగూ మార్కెట్ ఉంది కాబట్టి మలయాళం కూడా మంచి ప్రమోషన్స్ చేసి మొత్తంగా పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ కాన్సెప్ట్ ను పరశురామ్ ఎలా తెరకెక్కిస్తున్నాడో గాని నిర్మాతలు మాత్రం మిగతా భాషల్లో భారీగా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. అయితే సర్కార్ వారి పాట సినిమాను మొదలు పెట్టి దాదాపు ఏడాది కావస్తుంది. ఈ సమయంలో సడన్ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలి అంటే ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి
.

Post a Comment

Previous Post Next Post