OTTలో రాబోతున్న టాలీవుడ్ కొత్త సినిమాలు!


ఈ నెలలో మూడు ప్రధాన తెలుగు బిగ్ సినిమాలు OTTకి వచ్చేలా కనిపిస్తున్నాయి. తెలుగు OTT ప్రేక్షకులకు రాబోయే రోజుల్లో మంచి ఎంటర్టైన్మెంట్ అయితే అందునుంది. ఆ జాబితాలో మొదటిది ఖిలాడీ, ఈ చిత్రం ఈ నెల 11 నుండి డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.  ఆ తర్వాత ఆడవాళ్లు మీకు జోహార్లు.  ఈ చిత్రం మార్చి 25న సోనీ లైవ్‌లో రానుందని సమాచారం.

చివరగా, ఈ నెలలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తో OTTకి వస్తున్నాడు.  కానీ అధికారిక OTT విడుదల తేదీ ఇంకా ధృవీకరించబడలేదు.  ఈ చిత్రం డిస్నీ+ హాట్‌స్టార్ 
 ఆహా వీడియోలో వస్తుంది. మరోవైపు బిగ్ స్క్రీన్ పై రాధేశ్యామ్ 11వ తేదీన విడుదల కానుంది. అలాగే మార్చి 25వ తేదీన RRR రానుంది. ఒకవైపు బిగ్ స్క్రీన్ పై అలాగే మరోవైపు ఓటీటీలో సినిమాల సందడి మామూలుగా లేదు. మరి ఏ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post