ఎన్టీఆర్ కోసం ఉప్పెన పట్టు?


మొత్తానికి త్రిబుల్ ఆర్ సినిమా తో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నారు. ఇక వీరిద్దరూ తర్వాత సినిమాలతో రాజమౌళి లేకుండా ఎలాంటి సక్సెస్ అందుకుంటారు అనేది హాట్ టాపిక్ గా మారింది. అందుకే వీలైనంత వరకు పర్ఫెక్ట్ కథలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాలను చేయాలి అని ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అయితే ఆ విషయంలో చాలా ఓపికతో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ రిస్క్ చేయలేకనే త్రివిక్రమ్ సినిమాను పక్కన పెట్టేశాడు. కొరటాల శివ అతనికి నమ్మకం ఉండటంతో కొత్త ప్రాజెక్టును మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇక ప్రశాంత్ నీల్ టాలెంటెడ్ కాబట్టి అతనిపై కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అయితే ఉప్పెన దర్శకుడిపై ఎన్టీఆర్ ఇంకా ఒక క్లారిటీ రావడం లేదు. ఇది వరకే చాలాసార్లు బుచ్చిబాబు ఒక కథ గురించి చెప్పినప్పటికీ కూడా ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదట. ఇక ఎన్టీఆర్ ఎన్నిసార్లు నచ్చలేదని చెప్పినా కూడా బుచ్చిబాబు తన పట్టును విడవడం లేదు అని తెలుస్తోంది. ఎన్టీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం తో అతను ఎలాగైనా తన తదుపరి సినిమా ను యంగ్ టైగర్ తోనే చేయాలి అని ఫిక్స్ అయ్యాడు. మరి ఎన్టీఆర్ అతనికి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.


Post a Comment

Previous Post Next Post