డిస్ట్రిబ్యూటర్ గా కూడా మంచి గుర్తింపును అందుకున్న దిల్ రాజు ఒకవైపు సినిమాలు నిర్మిస్తునే మరోవైపు పంపిణీదారుడి గా కూడా ఆదాయాన్ని అందుకుంటున్నారు. నైజాం ఏరియాలో ఎదురులేని రాజు గా కొనసాగుతున్న దిల్ రాజు ఇటీవల RRR సినిమా తో మంచి లాభాలను అందుకున్నాడు. రాధే శ్యామ్ కొట్టిన దెబ్బతో దాదాపు 15 కోట్ల వరకు నష్టపోయిన దిల్ రాజు ఇపుడు RRR సినిమాతో అయితే డబుల్ ప్రాఫిట్స్ అందుకునే విధంగా అడుగులు వేస్తున్నాడు.
ఇక RRR తర్వాత దిల్ రాజు విజయ్ బీస్ట్ సినిమాను నైజాం ఏరియాలో భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నాడు. తెలుగులో ఈ సినిమా విడుదల హక్కులను దిల్ రాజు సురేష్ బాబు ఏషియన్ సినిమాస్ సునీల్ దక్కించుకున్నారు. ముగ్గురు కూడా భాగస్వామ్యంతో తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఇక నైజాం ఏరియాలో దిల్ రాజు బీస్ట్ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. RRR సినిమాకు స్క్రీన్స్ తగ్గించి మరి బీస్ట్ సినిమా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment