RRR మొత్తంలో ఎవరు ఎక్కువంటే.. రామ్ చరణ్ కౌంటర్!


త్రిబుల్ ఆర్ సినిమా లో జూనియర్ ఎన్టీఆర్ ను తక్కువ చూపించే రామ్ చరణ్ ను ఎక్కువగా హైలెట్ చేసినట్లుగా కొంత మంది అభిమానుల నుంచి భిన్నాభిప్రాయాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన పాత్ర విషయంలో అలా ఎప్పుడూ అనుకోలేదు అని చాలా క్లారిటీగా చెప్పాడు. ఇక రీసెంట్ గా బాలీవుడ్ మీడియా ముందుకు వెళ్ళిన చిత్ర యూనిట్ సభ్యులకు అలాంటి ప్రశ్న ఎదురయింది.

సినిమాలో రామ్ చరణ్ ఎక్కువ హైలైట్ చేశారు అని ఆ ఘనత మొత్తం రామ్ చరణ్ కొట్టేశాడు అంటూ బాలీవుడ్ మీడియా డైరెక్ట్ గా ప్రశ్నించగా అందుకు రామ్ చరణ్ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు.. 'అలా ఎంతమాత్రం కాదు మేడం.. నేను దాన్ని అస్సలు నమ్మను. మేమిద్దరం కూడా చాలా బాగా నటించాం. ముఖ్యంగా తారక అద్భుతంగా చేశాడు. RRR ద్వారా గతంలో ఎప్పుడూ లేని అనుభవాన్ని నేను ఈ సినిమాతో పొందాను. ముఖ్యంగా తారక్ తో నా ప్రయాణం చాలా అత్యుత్తమం.. దాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన రాజమౌళికి ధన్యవాదాలు.. అంటూ రామ్ చరణ్ స్వీట్ గా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.


Post a Comment

Previous Post Next Post