Ghani Movie @ Review


కథ:
విక్రమాదిత్య 2004 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ను గెలవడంలో స్టెరాయిడ్ వాడినట్ల ఆరోపణల వస్తాయి. దీంతో అతనిని ఆట నుండి సస్పెండ్ చేస్తారు. ఇక విక్రమాదిత్య కొడుకు గనిఆ తరువాత ఒక మంచి అంశంతో సమాజానికి ఒకటి చెప్పాలని బాక్సర్‌గా మారాలనుకుంటున్నాడు. కానీ బాక్సింగ్‌లో పాల్గొనకూడదని గని తల్లి కోరుకుంటుంది. అయినప్పటికీ గని ఆమెకు తెలియకుండా సాధన చేసి జిల్లా ఛాంపియన్‌గా నిలుస్తాడు. అయితే ఒకప్పుడు గని తండ్రికి ప్రత్యర్థి అయిన విజేంద్ర సిన్హా గతంలోని వాస్తవ సంఘటనలను వెల్లడిస్తాడు. అసలు గని తండ్రి విషయంలో ఏం జరిగింది.. బెట్టింగ్ సిండికేట్ కింగ్‌ జగపతిబాబు గురించి తెలిసిన నిజం ఏమిటీ? అసలు గని  ఎలా రివెంజ్ తీర్చుకుంటాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..


విశ్లేషణ:
స్పోర్ట్స్ డ్రామెగా తెరకెక్కిన గనిలో కమర్షియల్ స్పెస్ కోసం దర్శకుడు స్క్రీన్ ప్లే విషయంలో చాలా తెలివిగానే ఆలోచించాడు. బాక్సర్ డ్రీమ్, అందులో మదర్ సెంటిమెంట్, మరోవైపు లవ్ ట్రాక్.. తండ్రి ఆశయం.. మరో సైడ్ బెట్టింగ్..ఇలా విభిన్నమైమ కోణాల్లో గని సినిమాను హైలెట్ చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా బెట్టింగ్ అంశాన్ని చూపించిన విధానం కొత్తగా ఉంది. సినిమాను రెగ్యులర్ గా కాకుండా కాస్త డిఫరెంట్ గా తెరకెక్కించే ప్రయత్నం అయితే చేశారు. ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై కాస్త అంచనాలను పెంచుతుంది. అయితే ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ మాత్రం ప్రేక్షకుల ఓపికకు పరీక్ష పెడతాయి. 

దర్శకుడు కిరణ్ కొర్రపాటి కథలో ఎలిమెంట్స్ ను బలమైన ప్లాట్ గా సెలెక్ట్ చేసుకున్నాడు కానీ కొన్ని సన్నివేశాలు ఇంకా హైలెట్ అయ్యి ఉంటే బాగుండేవి. సాయు మంజ్రేకర్ తో వచ్చే లవ్ ట్రాక్ అంత కొత్తగా ఏమి అనిపించదు. ఇక కొన్ని సెంటిమెంట్ ఎమోషనల్ సీన్స్ కూడా రొటీన్ గానే అనిపిస్తాయి. వరుణ్ తేజ్ మాత్రం బాక్సర్ గా తనను తాను మార్చుకున్న విధానం మాత్రం అద్భుతంగా ఉంది. డైలాగ్స్ ఇంకా బలంగా రాసి ఉంటే బాగుండేది. ఇక జగపతిబాబు, ఉపేంద్ర పాత్రలు సినిమాలో మరో హైలెట్ పాయింట్స్. ఇక సునీల్ శెట్టి కూడా అద్భుతంగా నటించాడు.

ఈశ్వర్నాథ్ గా జగపతి బాబు హై ప్రొఫైల్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ లీగ్ మరియు బెట్టింగ్ కార్యకలాపాలు, రివెంజ్ ఎపిసోడ్‌లు,  కొన్ని ట్విస్ట్‌లు రివీల్ చేయబడిన విధానం సెకండాఫ్‌లో మెరుగ్గా ఉన్నాయి. రచయిత దర్శకుడు కిరణ్ కొర్రపాటి హిట్ సినిమాగా మారడానికి తగిన కథనంతో ముందుకు వచ్చారు. అయితే ఫైనల్ అవుట్‌పుట్ యావరేజ్‌కు మించలేదు. ఇక ఈ చిత్రానికి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.  నూతన నిర్మాణ సంస్థ రినైసన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ ఈ చిత్రాన్ని సరైన మేకింగ్ కోసం గట్టిగానే ఖర్చు చేసినట్లు అనిపిస్తుంది. ఇక ప్రతి పాత్ర కోసం, వారు పేరున్న నటీనటులను తీసుకున్నారు. ఇక ఫైనల్ గా సంగీత దర్శకుడు థమన్ అంచనాలకు తగ్గట్లుగా మ్యూజిక్ తో పెద్దగా మెప్పించలేకపోయాడు. ఫైనల్ గా గని సినిమా కథలోని కొన్ని పాయింట్స్ తో పరవాలేదు అనిపించింది.


ప్లస్ పాయింట్స్:
👉వరుణ్ తేజ్ గని క్యారెక్టర్
👉ఇంటర్వెల్ ట్విస్ట్

మైనెస్ పాయింట్స్:
👉ఫస్ట్ హాఫ్
👉మ్యూజిక్
👉రొటీన్ సీన్స్

రేటింగ్: 2.75/5

Post a Comment

Previous Post Next Post