అన్నతోనే ఎన్టీఆర్ వ్యాపారం!


జూనియర్ ఎన్టీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా వరుసగా రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇచ్చాడు. ముందుగా కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్న ఎన్టీఆర్  అనంతరం ప్రశాంత్ నీల్ తో కూడా మూవీ చేయబోతున్నట్లు పోస్టర్ విడుదల చేశాడు. ఇక ఈ రెండు సినిమాలపై అంచనాలు అయితే హై రేంజ్ లోనే ఉన్నాయి.

ఇక ఎన్టీఆర్ చేస్తున్న ఈ రెండు సినిమాలకు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్... యువ సుధ, మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి ప్రాజెక్ట్ లను నిర్మించనుంది. ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అయితే రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. కళ్యాణ్ రామ్ పై పెద్దగా భారం పడకుండా సక్సెస్ తరువాత లాభాల్లో వాటా తీసుకోవాలని డీల్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. ఒకవేళ అదే జరగకపోయి ఉంటే గనక ఎన్టీఆర్ ఒక్కో సినిమాకి 55 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునేవాడట. మరి ఈ ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లను అందుకుంటాయో చూడాలి.

Post a Comment

Previous Post Next Post